Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలివైన జయమ్మకు ఓటేశాం.. నిశాని శశికళకు కాదు.. నెటిజన్ల కామెంట్స్

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (12:29 IST)

Widgets Magazine

తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. గత ఎన్నికల్లో చదువుకున్న జయలలితకు ఓటు వేశామనీ, నిశాని శశికళకు కాదంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 
ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గత యేడాది అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆమె వారసుడిగా నమ్మినబంటు ఓ పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అయితే, జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో పార్టీ పగ్గాలను స్వీకరించిన శశికళ ఇపుడు.. అన్నాడీఎంకే శాసనసభాక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అనూహ్య పరిణామాలు, శశికళ వ్యవహారశైలిపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శశికళకు వ్యతిరేకంగా నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. దీనికితోడు "చేంజ్ డాట్ ఆర్గనైజేషన్" అనే సంస్థ శశికళ సీఎం పదవి చేపట్టంపై ఆన్‌లైన్ ద్వారా నెటిజెన్స్ అభిప్రాయాలను సేకరిస్తోంది. 
 
ఆదివారం ఈ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభమైంది. ఇందులో సుమారు 19 వేల మంది శశికళకు వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలపడం గమనార్హం. తాము చదువుకున్న తెలివైన జయలలితకే ఓటు వేశా తప్ప నిశాని శశికళకు కాదని వారు స్పష్టం చేస్తున్నారు. మరోసారి ఎన్నికలు పెట్టయినా సరే.. తమ నాయకుడు లేదా నాయకురాలిని ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, శశికళకు వ్యతిరేకంగా తాము సేకరించిన సంతకాలను రాష్ట్రపతి, గవర్నర్‌లకు అందజేస్తామని నెటిజెన్స్ తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అపుడు అత్యాచారం చేశాడు.. ఇపుడు తాళి కట్టాడు...

అపుడు అత్యాచారం చేసిన నిందితుడే ఇపుడు జైల్లో తాళి కట్టాడు. ఈ వింత ఘటన ఒడిషా రాష్ట్రంలోని ...

news

ముస్లిం తీవ్రవాదుల వల్ల జరగరానిది జరిగితే ఆ న్యాయమూర్తిని బాధ్యుడిని చేయాలి : ట్రంప్ నిప్పులు

అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ...

news

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో న్యాయస్థానం... స్టే ఎత్తివేతకు ససేమిరా

అమెరికాలోకి ప్రవేశించకుండా ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాజ్ఞలు విధించిన ఆ దేశ కొత్త ...

news

శశికళ కార్యసాధకురాలా? డీఎంకే - కాంగ్రెస్ - బీజేపీ - దీప వ్యూహాలను తట్టుకుంటారా..!

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా తమిళనాడు రాజకీయాలేనే చర్చ సాగుతోంది. డిసెంబర్ 5వతేదీ జయలలిత ...

Widgets Magazine