సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (14:14 IST)

మహారాష్ట్రలో ఘోరం : రోడ్డు ప్రమాదంలో 9 మంది సజీవదహనం

road accident
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, 
 
చంద్రాపూర్ - ముల్ రోడ్డుపై అజయ్ పూర్ సమీపంలో డీజల్ ట్యాంకర్, మొద్దుల లోడుతో వెళుతున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో రెండు వాహనాల్లో ఉన్న వారు 9 మంది మంటల్లోనే కాలిపోయారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రెండు లారీలు, అందులోని మనుషులు కాలి బూడిదగా మారిపోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.