అసోం రాష్ట్రంలో వరదలు.. నీట మునిగి 108 జంతువులు మృతి
అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌ను కూడా వరదలు ముంచెత్తడంతో 108 జంతువులు మరణించాయని అసోం ప్రభుత్వం తెలిపింది.
వరదల కారణంగా చనిపోయిన వాటిలో 9 ఖడ్గమృగాలు, 4 అడవి గేదెలు, 7 అడవి పందులు, 2 స్వాంప్ జింకలు, 82 హాగ్ జింకలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కజిరంగా నేషనల్ పార్క్‌లోని 134 జంతువులను రక్షించారు. వారిలో 110 మందిని అడవిలోకి వదిలివేయగా, ఒక సంవత్సరం వయసున్న ఆడ ఖడ్గమృగం దూడతో సహా మరో 8 జంతువులు సిడబ్ల్యుఆర్‌సిలో చికిత్స పొందుతున్నాయి.