శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (18:19 IST)

కేరళలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న నిఫా వైరస్..

కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. నిఫా కలకలంతో అప్రమత్తమైన కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఏకకాలంలో రెండు వైరస్‌లతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళలో చాపకింద నీరులా విస్తరిస్తోంది నిఫా వైరస్. తాజాగా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు.
 
నిఫాతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడికి చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. బాలుడి నమూనాలను సేకరించిన అధికారులు.. ముందే పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కి పంపినట్టు వెల్లడించారు. వాటిని పరిశీలించిన నిపుణులు.. ఆ బాలుడి శరీరంలో నిఫా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. 
 
బాలుడితో కాంటాక్ట్‌ ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను ప్రారంభించామని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 30 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు.