గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (10:41 IST)

నిర్భయ సోదరుడు పైలట్ అయ్యాడు.. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు: జ్యోతిసింగ్ తల్లి

దేశ వ్యాప్తంగా 2012లో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన గుర్తుందా..? నిర్భయ కామాంధులకై బలైపోయింది. నిందితులు జైలు జీవనం గడుపుతున్నారు. అయినా వారిని ఇంకా ఉరితీయలేదు. ఈ నేపథ్యంలో నిర్భయను కోల్పోయిన వారి తల్ల

దేశ వ్యాప్తంగా 2012లో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన గుర్తుందా..? నిర్భయ కామాంధులకై బలైపోయింది. నిందితులు జైలు జీవనం గడుపుతున్నారు. అయినా వారిని ఇంకా ఉరితీయలేదు. ఈ నేపథ్యంలో నిర్భయను కోల్పోయిన వారి తల్లిదండ్రులు మాత్రం బిడ్డను కోల్పోయిన బాధలో కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్భయ ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ ఘటన సరికొత్త చట్టాన్ని రూపొందించేలా చేసింది. దానిపై నిర్భయ కుటుంబం సుదీర్ఘ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. 
 
నిర్భయ కుటుంబాన్ని ఏఐసీసీ డిప్యూటీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదుకున్నారని నిర్భయ (జ్యోతి సింగ్) తల్లి వెల్లడించారు. నిర్భయ సోదరుడు సోదరి మృతిపై  తీవ్రమైన బాధతో ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడని.. అలాంటి తన కుమారుడికి రాహుల్ గాంధీ కౌన్సిలింగ్ ఇప్పించారని నిర్భయ తల్లి చెప్పారు. ఎప్పటికప్పుడు వారు ఫోనులో మాట్లాడుతూ.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని స్ఫూర్తిని నింపేవారని తెలిపారు. 
 
రక్షణ రంగంలో రాణించాలని వుందని నిర్భయ సోదరుడు చెప్పగానే రాయ్ బరేలీలో అతనికి పైలట్ శిక్షణ ఇప్పించారని, ఇప్పుడు తన కుమారుడు పైలట్ అయ్యాడని జ్యోతిసింగ్ తల్లి చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా ప్రియాంకా గాంధీ కూడా ఫోన్ చేసి, తమ కుటుంబ క్షేమ సమాచారం తెలుసుకునేవారని ఆమె పేర్కొన్నారు.
 
12వ తరగతి పూర్తయ్యాక 18నెలల పాటు పైలట్ శిక్షణ తన కుమారుడు పైలట్ శిక్షణ తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గుర్గామ్‌లో ఫైనల్ ట్రైనింగ్‌లో వున్నాడని.. త్వరలో తన కుమారుడు ఆకాశంలో పైలట్‌గా ఎగురుతాడని ఆమె వెల్లడించారు.