గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 9 మే 2018 (12:31 IST)

ఆ పరీక్ష పాస్ అయితే రూ.లక్ష బహుమతి.. ఎక్కడ?

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ), బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌లో ప్రిలిమినర

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ), బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 వేల రూపాయల బహుమతి అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం(మే-8) జరిగిన బీహార్ రాష్ట్ర కేబినెట్ భేటీలో నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
అలాగే, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కూడా లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే ప్రతిపాదనకు సీఎం నితీశ్ కుమార్ ఆమోదముద్రవేశారు. "అనుసుచిత్ జతి ఇవమ్ అనుసుచిత్ జన్‌జాతి యోజన స్కీమ్" పేరుతో విద్యార్ధులకు ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.