గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:45 IST)

ఇపుడు మంత్రుల వంతు: వ్యాపారాలు ఉంటే మంత్రిపదవులకు రిజైన్ చేయండి : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఆయన.. ఆ మరుసటి రోజు నుంచే తన పనులు ప్రారంభించారు. సీఎంగా ఆయన తీసుకుంటున

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఆయన.. ఆ మరుసటి రోజు నుంచే తన పనులు ప్రారంభించారు. సీఎంగా ఆయన తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు యావత్ దేశ ప్రజలమీదా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 
 
ముఖ్యంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆమాత్యులకు మార్గదర్శకమవుతున్నాయి. అంతేకాదు, యోగి తీసుకున్న నిర్ణయాలకు కొందరికి బాంబుల్లా పేలుతుంటే, ప్రజానీకంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా తన మంత్రులకూ యోగి ప్రవర్తనా నియావళి విధించారు. 
 
మంత్రులంతా ఏ వ్యాపార సంస్థలోనైనా భాగస్వామం ఉంటే ముందుగా వెల్లడించాలని, లాభదాయక పదవుల్లో కొనసాగరాదనీ, అవినీతికి దూరంగా ఉండాలి. ఆర్భాటపు వేడుకలకు దూరంగా ఉండాలి. 5 వేల కంటే ఖరీదైన బహుమతి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలనీ, అధికారిక పర్యటనల్లో ప్రభుత్వ నివాసాల్లో బస చేయాలంటూ షరతులు విధించినట్టు సమాచారం.