గర్భిణీ స్త్రీలు ఆ కోరికలను పక్కనబెట్టాలి.. మాంసం మానుకోవాలి.. కోపాన్ని తగ్గించాలి..
గర్భిణీ స్త్రీలకు సంబంధించి మదర్ అండ్ చైల్డ్ కేర్ పేరిట ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ పుస్తకాన్ని ప్రచురించింది. గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలతో కూడిన దాంపత్య జీవితంతో సుఖ ప్రసవం జరుగుతుందని వైద్యులు సూచి
గర్భిణీ స్త్రీలకు సంబంధించి మదర్ అండ్ చైల్డ్ కేర్ పేరిట ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ పుస్తకాన్ని ప్రచురించింది. గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలతో కూడిన దాంపత్య జీవితంతో సుఖ ప్రసవం జరుగుతుందని వైద్యులు సూచిస్తున్న తరుణంలో.. గర్భం దాల్చిన స్త్రీలు పోషకాహారం తీసుకోవడంతో పాటు శృంగార వాంఛలను నియంత్రించుకోవాలని మదర్ అండ్ చైల్డ్ కేర్ పుస్తకం సూచించింది. అంతేకాకుండా.. కోపాన్ని తగ్గించుకోవాలని.. లైంగిక కోరికలను దూరంగా పెట్టాలని.. కోడిగుడ్లు, మాంసాహారాన్ని మానుకోవాలని చేసిన సూచనలు కొత్త చర్చలకు తెరలేపాయి.
ఈ మేరకు ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్ న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఇంకా గర్భిణీ మహిళలు నిద్రించే గదిలో అందమైన, మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే పోస్టర్లను గోడలపై అతికించుకోవాలని ఆ పుస్తకం సూచించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చెందిన ఆయుష్ శాఖ పంపిణీ చేసిన ఆ పుస్తకం.. గర్భిణీ మహిళలు ఆధ్యాత్మిక చింతనలు పెంచుకోవాలని.. చెడు ఆలోచనలను దూరంగా పెట్టాలని పేర్కొంది. ప్రతి ఏడాది 26 మిలియన్ల శిశువులు జన్మిస్తున్నారని.. వారి ఆలోచనా తీరు మెరుగుపడాలంటే గర్భిణీ మహిళలు ఈ సూచనలు పాటించాలని ఆ పుస్తకం వెల్లడించింది.