Widgets Magazine Widgets Magazine

భారతీయులందరూ.. దోసెకే ఓటేశారు.. ఇండియన్ ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్‌గా దోసె..

మంగళవారం, 6 జూన్ 2017 (17:52 IST)

Widgets Magazine

భారతీయులందరూ ఆ విషయంలో మాత్రం ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దోసెకే ఓటేశారు. భారతీయుల వంటకాలు రాష్ట్రానికి రాష్ట్రం తేడా వుంటుంది. భాషల పరంగా, ప్రాంతాల పరంగా ఆహారాల పదార్థాలు కూడా మారిపోతాయి. దక్షిణాది వంటకాలకు, ఉత్తరాది వంటకాలకు తేడా వుంటుంది.

దక్షిణాది వారు ఎక్కువగా ఇడ్లీ సాంబారు, దోసె వంటివి తీసుకుంటే.. ఉత్తరాది వారు ఎక్కువ చపాతీ, పుల్కా, దాల్ వంటివి తీసుకుంటారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయుల్లో అత్యధికులు దోసెనే అధికంగా ఇష్టపడుతున్నారు. 
 
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా దోసెనే ఆర్డర్ చేస్తున్నారట. టిఫిన్లపై జరిపిన స్విగ్గీ అనే ఆన్ లైన్ డెలివరీ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో దోసె అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో పోహా, పరోటాలు నిలిచాయి. వారాంతాల్లో దోసెల అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆ సర్వేలో వెల్లడి అయ్యింది
 
దోసెలో ప్లెయిన్ దోశ, మసాలా, రవ్వ, ఆనియన్, ఆనియన్ రవ్వ వంటి అనేక రకాలుండటంతో దోసెలను మన భారతీయులు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబారు వంటి వాటితో నంజుకుని తెగ లాగిస్తున్నారట. అదన్నమాట సంగతి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాదులో చైనా ప్లాస్టిక్ బియ్యం.. అన్నం ముద్దను నేలకేసి కొడితే బంతిలా ఎగిరింది..!

హైదరాబాదులో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఇప్పుడిప్పుడే దేశంలోని పలు రాష్ట్రాల్లో ...

news

ఆరేళ్ల చిన్నారిపై 50ఏళ్ల మహిళ బెత్తం దాడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (Video)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆహారం తీసుకుంటుండగా కింద రాల్చిందనే కారణంతో ...

news

ఓమలూరులో నిర్భయ తరహా ఘటన.. తల్లిదండ్రులపై అలిగింది.. గ్యాంగ్‌రేప్‌కు గురైంది..

నిర్భయ తరహా ఘటన ఓమలూరులో చోటుచేసుకుంది. 15 ఏళ్ల చిన్నారిని బస్సులోనే ముగ్గురు డ్రైవర్లు ...

news

అక్రమ సంబంధం... భార్యను ముక్కలు ముక్కలుగా చేసి... ఆ తరువాత?(Video)

అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ...