మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (17:34 IST)

ధర్మయుద్ధం కొనసాగుతుంది.. కమల్‌ హాసన్‌కు ఆ హక్కుంది: ఓపీఎస్

రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నటుడు కమల్‌హాసన్‌కు ఉందని, అయితే ఆయనపై రాష్ట్ర మంత్రులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం ఆరోపించారు. తాము ప్రారం

రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నటుడు కమల్‌హాసన్‌కు ఉందని, అయితే ఆయనపై రాష్ట్ర మంత్రులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం ఆరోపించారు. తాము ప్రారంభించిన ధర్మయుద్ధం కొనసాగుతుందని, ఈ యుద్ధంలో విజయం సాధించడానికి అందరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకేకి నాయకత్వం వహించే అర్హత పురట్చితలైవి అమ్మకు మాత్రమే ఉందని, తాము ప్రారంభించిన ఈ ధర్మయుద్ధం కొనసాగుతుందని ఉద్ఘాటించారు.
 
ఎన్నికల కమిషన్‌ శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించలేదని, అందువల్ల ఆమె లేదా ఆమె ద్వారా నియమితులైన ఇతరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రవేశించడానికి అనర్హులని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూదన్‌, కోశాధికారియైన తనను జయలలిత నియమించారని, అందువల్ల పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించే అర్హత, పార్టీకి నాయకత్వం వహించి.. నడిపించే అర్హత తమకు మాత్రమే ఉందన్నారు. 
 
అధికార పార్టీ చురుకుగా లేకపోవడంతో చెన్నైలో తాగునీటి సమస్య జఠిలమైందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జల్లికట్టుపై నిషేధం తొలగించాలని పది లక్షల మంది యువకులు మెరీనాలో ఉద్యమించినప్పుడు, ఆ సమస్యను చక్కగా పరిష్కరించానని గుర్తుచేశారు. చెన్నై తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి 2.5 టీఎంసీల నీటిని పొందానని చెప్పారు. అమ్మ ఆశీర్వాదంతో మూడుసార్లు ముఖ్యమంత్రిని అయ్యానన్నారు.