1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (10:39 IST)

ఒబామా ఆగ్రా పర్యటన రద్దు... ఎందుకు?

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పర్యటనలోంచి ఆగ్రాను రద్దు చేసుకున్నారు. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ ను చూడకుండానే ఆయన తిరుగు ప్రయాణమవుతారు. ఇంతకీ ఏం జరిగింది. తాజ్ పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు.? తెలుసుకుందాం రండీ.
 
అమెరికా అధ్యక్షుడు పర్యటన చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకుంది. తన పర్యటనను కుదించుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నారు. సౌదీఅరేబియా రాజు అబ్దుల్లా బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాచకుటుంబాన్ని పరామర్శించేందుకు ఒబామా దంపతులు రియాద్‌ వెళ్లాల్సి ఉంది. 
 
దీంతో మంగళవారం వారు తమ ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రేమకు చిహ్నంగా చలువరాతితో నిర్మించిన ప్రేమమందిరం తాజ్‌మహల్‌ను సందర్శించలేకపోవడంపై ఒబామా విచారం వ్యక్తంచేశారు.