బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు.. తప్పిన ఘోర ప్రమాదం

train
ఒరిస్సా కటక్‌కు సమీపంలో ఉన్న సుందర్ గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు వచ్చాయి. ఈ ఘటన రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. ఒకే ట్రాక్‌పైకి వందే భారత్ రైలుతో సహా మొత్తం మూడు రైళ్ళు వచ్చాయ. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
సంబల్‌పూర్ - రూర్కెలా మెమొ రైలు, రూర్కెల్ - ఝార్సుగూడ పాసింజర్ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైనులు ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరి - రూర్కెలా మధ్య నడిచే వదే భారత్ రైలు కూడా ఇదే ట్రాక్‌పై వచ్చింది. అయితే, మెమొ, పాసింజర్ రైళ్ళు ఎదురెదురుగా వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూర్కెలా రైల్వేస్టేషన్‌కు కేవలం 200 మీటర్లదూరంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.