బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (10:22 IST)

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాజెడీ - ఇప్పటికీ గుర్తించలేని 101 మంది మృతదేహాలు

coromandel tragedy
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ఘటనలో చనిపోయిన ప్రయాణికుల్లో ఇప్పటికీ 101 మంది ప్రయాణికుల వివరాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది వరకు గాయపడిన విషయం తెల్సిందే. 
 
వీరిలో ఆస్పత్రుల నుంచి 900 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మృతుల్లో 101 మంది ఎవరన్నదీ గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ 101 మంది ప్రయాణికుల వివరాలను తెలుసుకోవాల్సివుందని ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ డివిజనల్ మేనేజర్ రింకేష్ రాయ్ వెల్లడించారు.
 
మొత్తంగా 1100 మంది గాయపడగా వీరిలో దాదాపు 900 మంది చికిత్స తీసుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. దాదాపు 200 మంది వివిధ ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. మృతదేహాలను గుర్తించే పనిలో రైల్వే అధికారులు ఉన్నట్టు ఆయన తెలిపారు.