శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (09:33 IST)

మహిళకు ప్రసవకాన్పు చేస్తూ సెల్ఫీ తీసిన డాక్టర్...

వైద్యులు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్లతో సమానం. పోయే ప్రాణాలను కాపాడుతారు. కానీ, కొందరు వైద్యులు చేసే పనుల కారణంగా వైద్య వృత్తికే కళంకం కలుగుతోంది. ఒడిషా రాష్ట్రంలో ఓ మహిళకు ప్రసవం చేస్తూ కొందరు డాక్టర్లు సెల్ఫీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్‌లోడ్ కావడంతో అది వైరల్ అయింది. దీంతో ఆ సెల్ఫీ తీస్తున్న డాక్టర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ వచ్చి అడ్మిట్ అయింది. ఆ మహిళకు ప్రసవకాన్పు కోసం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అపుడు కొందరు డాక్టర్లు మాత్రం ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తుంటే ఓ డాక్టర్ మాత్రం తనవిధులను మరచి సెల్ఫీ తీశాడు. తర్వాత ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ డాక్టర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
డాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పలు విమర్శలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సూపరింటెండెంట్‌ను కోరారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.