మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (20:05 IST)

ఒన్ నేషన్... ఒన్ రేషన్ కార్డు విధానంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం: ప్రధానమంత్రి

ఒన్ నేషన్.. ఒన్ రేషన్ కార్డు విధానంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే, రోడ్డు, రేవులు, విద్యుత్తు తదితర జాతీయ ప్రాజెక్టులు వాటి ప్రగతి, ఆహార, పౌరపంపణీ (ఒన్  నేషన్  ఒన్ రేషన్ కార్డు) వంటి జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతి అంశాలపై  బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.

దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఒన్ నేషన్ వన్ రేషన్ కార్డు పేరిట దేశ వ్యాప్తంగా ఎక్కడైనా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంతో రేషన్ దుకాణాల్లో అక్రమాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వలస కార్మికులు వంటి వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది.

జాతీయ ఆహార భద్రతా చట్టం 2013కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఇప్పటికే అక్రమాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వలస కార్మికులు వంటి వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే ఎపి, తెలంగాణ, గుజరాత్, హర్యానా,జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈవిధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల కార్డుల డూప్లికేషన్‌ను కూడా అరిక్టేందుకు పూర్తి అవకాశం ఏర్పడింది. ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు విధానంతో జాతీయ ఆహర భద్రతా చట్టం కింద దేశంలో సుమారు 80కోట్ల మంది రేషన్ పొందుతున్నలబ్దిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

కార్డుదారులు వారి రేషన్ సరుకులను ఏ రేషన్ దుకాణం నుండైనా పొందేందుకు వీలు కలుగుతోంది. ముఖ్యంగా వలస కార్మికులు, రోజువారీ కూలీలు, పట్టణ ప్రాంత పేదలు ముఖ్యంగా చెత్త కాగితాలు ఏరుకునేవారు, వీధుల్లో నివసించేవారు, సంఘటిత, అసంఘటిత రంగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే కార్మికులు వంటి వారికి ఈ విధానం ఎంతగానో ప్రయోజనం కల్గిస్తుంది.

దేశవ్యాప్తంగా మెరుగైన ఉపాధి అవకాశాలకై తరచు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళే వారికి ఈవిధానం ఎంతో మేలు కల్గిస్తుంది. వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈఓ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.