శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జులై 2020 (16:29 IST)

సెప్టెంబర్‌ 30 వరకు ఆదాయపు పన్ను రిటర్నులకు అవకాశం

ఆదాయపన్ను చెల్లింపు దారులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. చెల్లింపులకు మరికొంత గడువు ఇచ్చింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్‌) సమర్పించేందుకు చివరి తేదీని సెప్టెంబర్‌ 30గా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31 వరకు గతంలో పెంచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. 2019-20 ఆర్థిక సంత్సర రిటర్నులు సమర్పించేందుకు గడువును పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్‌ 30కి పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ గడువును జులై 31కి పొడిగించింది. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 30వరకు పొడిగించింది.