గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (12:30 IST)

డ్రెస్సింగ్ రూమ్‌లో పెప్‌టాక్ ఏంటి.. మోదీపై ప్రియాంక చతుర్వేది ఫైర్

Modi
టీమిండియా ఓటమి అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి ఆటగాళ్లలో ధైర్యం నూరిపోసి, స్ఫూర్తి నింపే పెప్‌టాక్ చేశారు. ఇప్పుడీ పెప్‌టాక్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
ఓటమిని జీర్ణించుకోలేని ఆటగాళ్లు అసౌకర్యంగా కనిపిస్తుంటే ప్రధాని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పారు. తాను టాయిలెట్‌లో ఉండగానో, బెడ్రూములో ఉన్నప్పుడో, డ్రెస్సింగ్ రూములో ఉన్నప్పుడో తన మద్దతుదారులను మోదీ అనుమతిస్తారా? అని ప్రశ్నించారు.
 
డ్రెస్సింగ్ రూము అనేది ఏ జట్టుకైనా చాలా పవిత్ర స్థలమని, ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తప్ప ఐసీసీ మరెవరినీ దాంట్లోకి అనుమతించదని పేర్కొన్నారు. ఆటగాళ్లను ఓదార్చాలనుకుంటే మోదీ డ్రెస్సింగ్ రూమ్ బయట ప్రైవేట్ విజిటర్స్ ఏరియాలోనే ఆ పనిచేసి ఉండొచ్చని అన్నారు.