గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 12 అక్టోబరు 2017 (19:00 IST)

సర్... పళణిస్వామి నన్నలా చూస్తున్నాడు - ప్రధానికి పన్నీరు ఫిర్యాదు

తమిళనాడులో ముఖ్యమంత్రి పళణి స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలకు మధ్య జరుగుతున్న వార్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగే చిల్లర గొడవలా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే కలిసి ముందుకు సాగుతున్నారు. అయితే ఇద్దరూ

తమిళనాడులో ముఖ్యమంత్రి పళణి స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలకు మధ్య జరుగుతున్న వార్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగే చిల్లర గొడవలా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే కలిసి ముందుకు సాగుతున్నారు. అయితే ఇద్దరూ కలిసిన కొన్ని రోజులకే మళ్ళీ గొడవలు ప్రారంభమయ్యాయి. తాను పళణిస్వామితో కలవక ముందే తనకు కేబినెట్లో కీలకమైన పదవులు ఇవ్వాలని చెప్పానని అయితే ఆయన ఇప్పుడు ఇవ్వడం లేదని ఏకంగా ప్రధానినే కలిసేందుకు ఢిల్లీ వెళ్ళారు పన్నీరుసెల్వం.
 
రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనన్ను పన్నీరు సెల్వం, పళణి స్వామి వ్యవహారంపై మోదీకి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకున్నారు పన్నీరుసెల్వం. గత వారం రోజుల నుంచి పన్నీరు, పళణిస్వామిల మధ్య అస్సలు మాటలు లేవని అన్నాడిఎంకే నేతలు చెప్పుకుంటున్నారు. పన్నీరుసెల్వం ప్రధానిని కలవడం పళణిస్వామి వర్గీయులకు ఏ మాత్రం ఇష్టం లేదు. 
 
పన్నీరుపై పళణి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనను పురుగు కన్నా హీనంగా పళణిస్వామి, అతని అనుచరులు చూస్తున్నారని పన్నీరు సెల్వం ప్రధానికి ఫిర్యాదు చేయనున్నారు.