గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (10:27 IST)

భారత్‌లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 9,851 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో అత్యధికంగా 9,851 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 
 
ఒకే రోజు 273 మంది ప్రాణాలు వదలడం ఆందోళన కలిగిస్తోంది.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,26,770కు చేరగా.. మృతుల సంఖ్య 6,348కు పెరిగింది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనాబారినపడి 1,10,960 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఇక, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,09,461 మంది డిశ్చార్జ్ అయ్యారు.