1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (17:37 IST)

భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. నాలుగో రోజు ఎన్‌కౌంటర్

indian army
జమ్మూకాశ్మీర్‌లోని భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య వరుసగా నాలుగో రోజు ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కోకెరంగ్‌లోని గడుల్ అటవీ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, స్థానిక పోలీసులు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఆ రోజు రాత్రి ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రోజులు గుడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ సైనికుడు గల్లంతవగా, ముగ్గురు అధికారులు అమరులయ్యారు. 
 
కొండపైన గుహలో ఉన్న ఉగ్రవాదులు కిందనున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. కొండను చుట్టుముట్టిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తున్నాయి. 
 
వాతావరణంతో పాటు అక్కడి పరిస్థితులు సైన్యానికి సవాలుగా మారడంతో ఉగ్రవాదులపై పట్టు సాధించడం కష్టంగా మారుతోంది. పూర్తిస్థాయి శిక్షణ పొందిన ఉగ్రవాదులు కావాల్సిన ఆహారం, పేలుడు సామగ్రితో పక్కా ప్రణాళిక ప్రకారం అందులో తలదాచుకున్నారు. గుహలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండొచ్చని సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.