గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 మార్చి 2019 (13:15 IST)

కాశ్మీర్‌లో జమాతే ఆస్తులు సీజ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థకు చెందిన ఆస్తులన్నీ అధికారులు సీజ్ చేశారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వేర్పాటువాద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, దశాబ్దాలుగా కాశ్మీర్‌ లోయలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తూ, గట్టి పట్టున్న జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, ఆ సంస్థకు చెందిన ఆస్తులను సీజ్ చేసింది. 
 
శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లోని జమాతే ఆ సంసంస్థకు చెందిన సంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 70 ఆస్తుల్ని సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నదనే ఆరోపణలతో జమాతే సంస్థపై కేంద్ర హోంశాఖ ఐదేళ్ళపాటు నిషేధం విధించిన విషయం తెల్సిందే. గత నాలుగు రోజుల్లోనే ఆ సంస్థకు చెందిన 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు.