సరిగ్గా బుద్ధి చెప్పిన భారత్.. జాతీయ జెండాను తలకిందులు చేసిన పాకిస్థాన్..

indian army
Last Updated: సోమవారం, 25 మార్చి 2019 (10:22 IST)
పాకిస్థాన్ సైన్యానికి భారత దళాలు సరిగ్గా బుద్ధి చెప్పాయి. ప్రతీసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే పాక్ సైన్యానికి భారత జవాన్లు తగిన విధంగా బుద్ధి చెప్పారు. గత మూడు రోజులుగా జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ గత మూడు రోజులుగా కాల్పులకు తెగబడుతోంది.
 
దీంతో ఎదురు కాల్పులు ప్రారంభించిన భారత్ 12 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. భారత్ కాల్పుల్లో మరో 22 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక పాకిస్థాన్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. 
 
భారత సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించడంతో పాక్ సైన్యం వణికిపోయింది. తమ జాతీయ జెండాలను తలకిందులు చేసి ఓటమిని అంగీకరించింది. కాల్పులు ఆపాలంటూ పరోక్షంగా సంకేతాలు పంపడంతో భారత సైన్యం కాల్పులు ఆపింది. భారత కాల్పుల్లో గాయపడిన వారిని పాక్ సైన్యం హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలించింది. దీనిపై మరింత చదవండి :