Widgets Magazine Widgets Magazine

‘ఏయ్‌ పన్నీర్‌’ అని పిలవగానే చిత్తం చిన్నమ్మా అంటాననుకున్నావా? సెల్వం... పన్నీర్‌ సెల్వం!

హైదరాబాద్, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (04:04 IST)

Widgets Magazine

తమిళనాడు ప్రజల ముందుకు కొత్త కబాలి వచ్చేశాడు. కబాలి డా... అంటూ రజనీకాంత్ ఇటీవలే కబాలి సినిమాలో పంచ్ డైలాగుతో జనాల్ని అదరగొట్టినట్లుగా ఇప్పుడు మరో కబాలి రంగంలోకి దిగాడు. పిలవగానే వచ్చి జీ హుజార్ అనడానికి నీ ఇంటి పాలేరుననుకున్నావా చిన్నమ్మా.. సెల్వం, పన్నీర్ సెల్వం అంటూ జనాల్ని వెర్రెత్తిస్తున్నాడు. 
 
సోషల్‌ మీడియా ప్రచారంలో భాగంగా కబాలి సినిమాలో రజనీకాంత్‌ పాపులర్‌ డైలాగ్‌  ‘ముఖం మీద గాటుపెట్టుకుని, మీసం తిప్పి, లుంగీకట్టుకుని పాత విలన్‌ ‘ఏయ్‌ కబాలి’ అనగానే ఒంగొని ఎస్‌ బాస్‌ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నార్రా’ అనే డైలాగ్‌ను ‘పాత రోజుల్లోలా నుదుటున బొట్టు పెట్టుకుని పంచె కట్టుకుని ‘ఏయ్‌ పన్నీర్‌’ అని పిలవగానే చిత్తం చిన్నమ్మా అని వినయంగా నిల్చుంటాననుకున్నావా సెల్వం.. పన్నీర్‌ సెల్వం’ అంటూ రజనీకాంత్‌ ఫొటోలో పన్నీర్‌ తల పెట్టి గ్రాఫిక్‌ చేసిన ఫొటో, వీడియో ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో వైరల్‌గా మారింది. 
 
కబాలి సినిమాలో రజనీ డైలాగ్‌ జనాన్ని ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు పన్నీర్‌ సెల్వం డైలాగ్‌ కూడా టైమ్లీగా అంతే స్థాయిలో పేలింది. కబాలి వేషంలో పన్నీర్ సెల్వం ఫోటోను చూస్తున్న  జనం వెర్రెత్తిపోతూ చిన్నమ్మను తల్చుకుని పగలబడి నవ్వుకొంటున్నారు. 
 Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

హామీ ఇచ్చాక ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? నిలదీసిన టీఆరెస్ కవిత

ఆంద్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదాపై టీఆరెస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మళ్లీ గళం విప్పారు. ...

ఆడపిల్ల అంత పాపం చేసి పుడుతోందా: మనీషా ఆవేదన

స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం ...

గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారో లేదో కానీ.. ఇదొక కొత్త టెన్షన్!

తమిళనాడు ప్రస్తుతం నిత్య ఉద్రిక్తతల మధ్య కాలం గడుపుతున్నట్లుంది. గత నాలుగురోజులుగా ...

news

గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారో లేదో కానీ.. ఇదొక కొత్త టెన్షన్...

తమిళనాడు ప్రస్తుతం నిత్య ఉద్రిక్తతల మధ్య కాలం గడుపుతున్నట్లుంది. గత నాలుగురోజులుగా ...