Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్మారక నిలయంగా పోయెస్ గార్డెన్ ఇల్లు . పన్నీర్ ఆదేశాలు : అడ్డుకుంటానన్న శశికళ

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:33 IST)

Widgets Magazine

ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇపుడు పన్నీర్ సెల్వం - శశికళకు ఆధిపత్య పేరుకు కేంద్రంగా మారింది. జయలలిత ఇంటిని అమ్మా మెమోరియల్‌గా మార్చుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం జీవో జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
జయలలిత మరణానంతరం శశికళతో పాటు... మన్నార్గుడి మాఫియా నివాసముంటుంది. అయితే వేద నిలయాన్ని జయలలిత స్మారకంగా మార్చుతానని పన్నీరు సెల్వం కొద్దిసేపటి క్రితం చెప్పారు. శశికళ, ఆమె కుటుంబం అక్రమంగా అక్కడ ఉంటున్నారని పన్నీరు సెల్వం ఆరోపించారు. దీనికి సంబంధించిన జీవో తయారు చేసి తీసుకునిరావాలని గురువారం తనను కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను ఆదేశించినట్టు సమాచారం. 
 
మరోవైపు.. పన్నీర్ నిర్ణయాన్ని శశికళ తీవ్రంగా ఖండించారు. శశికళ ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెబుతున్నారు. జయలలిత నివాసమున్న ఆ ఇల్లు ఇళవరసి కొడుకు వివేక్ పేరు మీద ఉందని, ఇళవరసి స్వయానా శశికళ వదిన అని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు. వేద నిలయం ప్రభుత్వ ఆస్తి కాదని, ప్రైవేట్ ఆస్తి అని శశికళ వర్గీయులు వాదిస్తున్నారు. ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తే కోర్టును ఆశ్రయిస్తామని శశికళ వర్గం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో జయలలిత వేద నిలయం కూడా చర్చనీయాంశం కావడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Panneerselvam Issues Orders Memorial Convert Jayalalithaa’s Poes Garden Residence

Loading comments ...

తెలుగు వార్తలు

news

గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేల మస్తు మజా.. బాత్రూమ్ బ్రేక్ అంటూ షణ్ముగనాథన్ ఎస్కేప్.. ఓపీ ఇంటికెళ్లారా?

అమ్మ సెంటిమెంట్.. తీవ్ర ఉత్కంఠ.. బల పరీక్షలో నెగ్గేదెవరు? సీఎం పీఠం ఎవరిని వరిస్తుంది? ...

news

సోషల్ మీడియాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు... సపోర్ట్ పన్నీర్ అంటూ ట్వీట్లు...

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ...

news

పన్నీర్ సెల్వం దూకుడు.. పోలీస్ కమిషనర్ బదిలీ.. పార్టీ ఖాతాల్లో డబ్బు తీస్తే తాటతీస్తా..!

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం పరిపాలన పరంగా జోరు పెంచారు. ఇన్నాళ్లు ...

news

ట్రంప్ కుమార్తె ఇవాంక బ్రాండ్ ఉత్పత్తుల్ని విక్రయించేది లేదు: నార్డ్‌స్ట్రూమ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఆయన కుమార్తెకు నార్డ్‌స్ట్రూమ్ సూపర్ ...

Widgets Magazine