1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (11:09 IST)

సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు వందశాతం పెంపు.. పార్లమెంటరీ కమిటీ సిఫారసు

ప్రస్తుతం దేశంలో సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న జీతభత్యాలను వందశాతం పెంచుతూ రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అలాగే, మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్లను కూడా దాదాపు 75 శాతం పెంచాలని సూచించింది.
 
ఎంపీలకు చివరిసారిగా 2010లో వేతనసవరణ జరిగింది. కేబినెట్‌ కార్యదర్శి కంటే ఎంపీల స్థాయి ఎక్కువ కాబట్టి వారికి కల్పించే సదుపాయాలు కూడా అందుకుతగ్గట్లుగానే ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఈ కమిటీ సుమారు 60 ప్రతిపాదనలు చేసింది. మరికొన్ని సిఫారసులను ఈ నెల 13వ తేదీన జరిగే సమావేశంలో ఖరారు చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.