1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 30 జులై 2015 (12:58 IST)

పార్లమెంటులో ‘స్మోకింగ్ జోన్’.. ప్రత్యేక గది ఏర్పాటు..

పార్లమెంటు సభ్యులు ఇక ప్రశాంతంగా దుమ్ముకొట్టొచ్చు. పార్లమెంటు సభ్యుల కోరిక మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంటు భవన సముదాయంలోనే  'స్మోకింగ్ జోన్' గదిని ఏర్పాటు చేశారు. 2004లో అప్పటి స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ పార్లమెంటు హాలులో పొగ తాగడాన్ని నిషేధించారు. అప్పటి నుంచి మన ఎంపీలకు దమ్ము కొట్టాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
 
ఇదే విషయాన్ని సుమిత్రా మహాజన్ వద్ద ప్రస్తావించగా వారి కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు. అది గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం స్టెనోగ్రాఫర్ల కోసం కేటాయించిన గదినే పొగత్రాగే గదిగా మార్చి, స్టెనోగ్రాఫర్ల పూల్‌ను పార్లమెంటు హాలులోని 3వ అంతస్థుకు తరలించారు.