ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (13:48 IST)

పాపకి డైపర్లు కావాలని రైల్వే మంత్రిని కోరిన ప్రయాణికుడు..!

భారత రైల్వే అభివృద్ధి కోసం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరంతరం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏదైనా సహాయం కోరితే వెంటనే వారికి సహకరించి అందరిచేత వాహ్వా అనిపించుకుంటున

భారత రైల్వే అభివృద్ధి కోసం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిరంతరం కృషి చేస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏదైనా సహాయం కోరితే వెంటనే వారికి సహకరించి అందరిచేత వాహ్వా అనిపించుకుంటున్నారు. తాజాగా మరోసారి మంచి పనిచేసి వార్తల్లోకెక్కారు. తన కూతురుతో కలసి రైల్లో ప్రయనిస్తున్నానని.. పాపకి డైపర్ కావాలంటూ ప్రభాకర్ అనే వ్యక్తి సురేష్ ప్రభుకు ట్విట్టర్ ద్వారా మెసేజ్ పెట్టాడు.
 
అతని అవసరాన్ని గుర్తించిన రైల్వే శాఖ... వివరాలు పంపాలంటూ సదరు వ్యక్తిని కోరింది. అయితే ప్రభాకర్ చేసిన పనిని పలువురు విమర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి స్పందిస్తున్నారు కదా అని... ఇంత చనువుగా ట్వీట్లు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో కూడా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన పాపకి డైపర్లు కావాలంటూ రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేయడంతో వారు స్పందించి సహాయం చేసిన విషయం తెలిసిందే.