గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మే 2020 (17:30 IST)

తాగుబోతులకు తిండిపెట్టకండి.. అవసరమైతే కొట్టండి.. పాల్

మహమ్మారి కరోనావైరస్‌తో ప్రజలు చనిపోతుంటే లిక్కర్ షాపులకు ఎలా ఇచ్చారని.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై మత ప్రభోదకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. 
 
ఉచిత రేషన్ ఆపివేసి… మద్యం తాగినవాళ్ల చేతులకు చుక్కలు పెట్టాలన్నారు. తాగొచ్చే భర్తలకు ఆడవాళ్లు బుద్ది చెప్పాలని.. తిండి పెటవద్దని, అవసరమైతే కొట్టండి అంటూ పాల్ పిలుపు నిచ్చారు.
 
లిక్కర్ షాపుల దగ్గర పౌరులు భౌతిక దూరం పాటించడం లేదని.. ఈ నిర్ణయం ద్వారా నష్టం తప్ప ఒక్క లాభం అయినా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలు క్యూ లైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా నిలబడితే కోవిడ్-19 వచ్చే ప్రమాదం ఉందన్నారు.
 
తనకు ఓ ఫ్రెండ్ కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధమని చెప్పారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.