మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (10:47 IST)

సంపన్న మహిళకు బెదిరింపులు.. రూ.2కోట్లు ఇవ్వకపోతే.. ఆ ఫోటోలను పోర్నోగ్రాఫిక్ సైట్లలో?

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భోపాల్‌లో ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి క్యాష్ చే

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భోపాల్‌లో ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి క్యాష్ చేసుకోవాలనుకున్నారు. బిట్‌కాయిన్ల రూపంలో 2 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే ఆమె ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీనిపై ఆ మహిళ ధైర్యం చేసి పోలీసులు ఫిర్యాదు చేసింది.
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళకు వచ్చిన ఈమెయిల్స్ అన్నీ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జబల్పూర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు.
 
ఓపెద్ద కుటుంబానికి చెందిన ఆ మహిళ.. ఈ తరహా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫొటోలు అన్నింటినీ ఆమె సోషల్ మీడియా కాంటాక్టులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో పాటు పోర్న్ సైట్లలో కూడా పెడతామని హ్యాకర్లు హెచ్చరించారు. నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు వాడటం వల్ల వాళ్ల సెర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమని కేసుపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.