Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళ ప్రజలు ఓట్లు వేసింది 'మన్నార్గుడి మాఫియా'కు కాదు జయలలితకు : ఎంకే.స్టాలిన్

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (12:21 IST)

Widgets Magazine
stalin - karuna

తమిళ ప్రజలు ఓట్లు వేసింది మన్నార్‌గుడి మాఫియాకు కాదనీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలితకు అని డీఎంకే కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో గంటగంటకూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అజెండా ప్రకటించకుండా శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడంతో మొదలైన అలజడి.. శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న వార్తలతో పతాకస్థాయికి చేరింది. 
 
ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా శశికళకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకిచ్చారని, జయలలిత మేనకొడలు దీపకు కూడా కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, రెండాకుల పార్టీ మూడు ముక్కలైందని.. ఆదివారం ఉదయం నుంచి రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాలపై విపక్ష డీఎంకే ఘాటుగా స్పందించింది. 
 
తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.కె.స్టాలిన్‌ స్పందించారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుట్టు చెప్పారు. శశికళనుకానీ, జయలలిత ఇతర కుటుంబసభ్యులనుకానీ ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ‘గత ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓటేసింది జయలలితకేకానీ, ఆమె కుటుంబసభ్యులకు కాదు. కాబట్టి శశికళనో, మరొకరినో సీఎంగా ప్రజలు ఒప్పుకోరు’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Jayalalithaa Househoold Vote Aiadmk Mk Stalin

Loading comments ...

తెలుగు వార్తలు

news

మసాజ్ మాటును వ్యభిచారం... చెన్నై బ్యూటీపార్లర్‌లో విచ్చలవిడి శృంగారం

చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. ...

news

హెచ్‌1బి వీసా బిల్లుతో మరో 2 బిల్లులు... ఐటీ రంగంపై ట్రంప్ సమ్మెటపోటు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హెచ్1బి ...

news

జయలలిత మృతికి కారణాలు వెల్లడించండి.. మోడీకి నటి గౌతమి లేఖ

‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు రోడ్డెక్కి పోరాటం చేయాలా?’ ...

news

రికార్డు స్థాయిలో పోలింగ్... పంజాబ్‌లో ఆప్‌దే ఆధికారం...

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో ...

Widgets Magazine