మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (14:36 IST)

తనలాంటి ప్రతిభావంతులను తమిళ ప్రజలు గుర్తించడం లేదు : తెలంగాణ గవర్నర్ తమిళిసై

tamizhisai sounderrajan
తనలాంటి ప్రతిభావంతులను తమిళనాడు ప్రజలు గుర్తించలేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. పైగా, తాను రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా సమర్థమంతంగా వ్యవహరిస్తున్నాని చెప్పారు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని మీడియా... మహాబలిపురంలో కాలుజారిపడిన వార్తను వైరల్ చేశాయని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, తనలాంటి ప్రతిభావంతులను తమిళ ప్రజలు గుర్తించలేదని కానీ, కేంద్రం గుర్తించి, తమ సత్తాను తెలుసుకుని గవర్నర్ పదవి ఇచ్చిందన్నారు. తనవంటి వ్యక్తుల ప్రతిభావంతుల ప్రతిభాపాటవాలు వృథాకారాదనే కేంద్రం తమను గుర్తించి పదవులలో కూర్చోబెడుతుందని చెప్పారు. తమ ప్రతిభను ప్రజలు గుర్తించివుంటే ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పోరాడి ఉండేవాళ్లమని అన్నారు. 
 
అంతేకాకుండా ఈ కార్యక్రమానికి రెండు సెల్ ఫోన్లు పట్టుకుని వస్తుండగా, ఓ పెద్దాయన పలుకరించరాు. రెండు సెల్‌ఫోన్లు ఎలా వాడుతున్నారు? అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల పాలనా వ్యవహారాలు చూస్తున్న నాకు అదో లెక్కా అని సమాధానం చెప్పినట్టు తమిళిసై తెలిపారు. పైగా, తాను 48 గంటల పాటు పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.