Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

త్రిపురలో లెనిన్ ... తమిళనాడులో పెరియార్ విగ్రహాలు కూల్చివేత

బుధవారం, 7 మార్చి 2018 (09:54 IST)

Widgets Magazine
periyar statue

త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మరుక్షణమే బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ కార్యకర్తల చర్యలను సమర్థించుకున్నారు. 
 
ఇంతలో తమిళనాడు రాష్ట్రంలోని పెరియార్ విగ్రహాన్ని కూల్చివేశారు. వేలూరు జిల్లా తిరుపత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లోపల ఉన్న పెరియార్ విగ్రహాన్ని కూల్చివేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహాం పగులగొట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నిజానికి త్రిపురలో లెనిన్ విగ్రహాలను కూల్చివేసిన మరుసటి రోజే బీజేపీకి చెందిన తమిళనాడు నేత హెచ్.రాజా మాట్లాడుతూ, తమిళనాడులో కూడా పెరియార్ విగ్రహాలను కూల్చివేస్తామంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
 
ఆయన ఇలా వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే తిరుపత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పెరియార్ విగ్రహాలను కూల్చివేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యకు నిరసనగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దావూద్ ఇబ్రహీం ఫోన్ నెంబర్ డిస్‌ప్లే కాదు: సోదరుడు కస్కర్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే ...

news

ముందురోజు ప్రియురాలిని చంపేశాడు.. మరుసటి రోజు పెళ్లిపీటలెక్కాడు...

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఓ కసాయి.. మరుసటి ...

news

ఏపీ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడిగా పోసాని క్రిష్ణమురళి...?!!

పోసాని క్రిష్ణమురళి. ఈయన గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. అందరికీ బాగా తెలిసిన వ్యక్తే. ...

news

యువతి ముందు ప్యాంటు విప్పి ఆ పని చేసిన కామాంధుడు...

బెంగళూరులో ఓ కామాంధుడు చేసిన చేష్టలకు ఓ యువతి భీతిల్లిపోయింది. ఆమె బస్సు కోసం వేచి ...

Widgets Magazine