మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (09:34 IST)

ప్రేమకు నో చెప్పాడని తండ్రి హత్యకు స్కెచ్ వేసిన కూతురు

crime scene
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాము అనుకున్న విషయాన్ని సాధించడం కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడట్లేదు. తాజాగా ప్రేమకు అభ్యంతరం చెప్పాడన్న కారణంతో ఓ ప్లస్ వన్ విద్యార్థిని తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి తన తండ్రిని హతమార్చాలని ప్లాన్ చేసిన ఘటన తమిళనాడులోని తేని సమీపంలో కలకలం రేపింది.
 
తనను, తన ప్రియుడిని విడదీయాలని ప్లాన్ చేయడంతో తన తండ్రిని చంపాలని విద్యార్థిని ప్లాన్ చేసింది. బాయ్‌ఫ్రెండ్, స్నేహితులతో కలిసి వేణుగోపాల్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించగా పోలీసులకు చిక్కింది. దీంతో విద్యార్థినితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.