మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:14 IST)

ప్రధాని మోడీకి భూటాన్ "నాడాక్ పెల్ గి ఖోర్లో" పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూటాన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది. భూటాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ఆ దేశం ప్రధానం చేసే "నాడగ్ పెల్ గి ఖోర్లో"తో సత్కరించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రధానమంత్రి లొటయ్ షెరింగ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడిస్తూ, ప్రధాని మోడీకి శుక్షాకాంక్షలు తెలిపారు. 
 
"భూటాన్ రాజు ఆదేశాల మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన భారతదేశానికే కాదు.. ప్రపంచానికి అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా, కోవిడ్ సమయంలో మోడీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నాం. భూటాన్ ప్రజల తరపున మీకు (మోడీ)కి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు. ఈ అవార్డు అందుకునేందుకు మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.