బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (20:15 IST)

ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం.. సిక్కుల గురువు జయంతిని..

PM modi
PM modi
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాత్రమే ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించడం ఆనవాయితీ. అయితే, గురు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మంగళవారం ఎర్రకోట నుంచి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు, గురు తేగ్ బహుదూర్ జ్ఞాపకార్థం ఓ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయనున్నారు.  
 
సిక్కుల గురువు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.