శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (17:54 IST)

వర్చువల్ ప్లాట్పార్మ్‌ ద్వారా శ్రీలంక ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్చెతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు వర్చువల్ ప్లాట్పార్మ్‌లో జరగడం విశేషం. ఈ సమావేశ ప్రారంభంలో ప్రధాని మాట్లాడుతూ ఇటీవల జరిగిన శ్రీలంక ఎన్నికలలో రాజపక్చె ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించచడంతో ఇరు దేశాల మధ్య సహాయ సహాకారాలు మరింత బలపడుతాయని చెప్పారు.
 
ఇరు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుకునేందుకు మరో అవకాశం వచ్చిందని అన్నారు. ఇరు దేశాల ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో మనవైపు చూస్తున్నారని తెలిపారు. వర్చువల్ ప్లాట్పార్మ్ ద్వారా మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
 
మరోవైపు గత ఆగస్టు నెల 9న శ్రీలంక ప్రధానిగా రాజపక్చె ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆయన బాధ్యతలను స్వీకరించిన తర్వాత వేరే దేశాధినేతతో ఆయన చర్చలు జరపడం ఇదే ప్రథమం. ఇరు దేశాల మధ్య అన్ని రంగాలలో ఉన్న బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధానులు చర్చలు జరిపినట్టు సమాచారం.