1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (16:19 IST)

పెద్ద నోట్ల రద్దు వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశమిదే...

దేశంలో పెద్ద నోట్ల కరెన్సీ నోట్ల రద్దు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన మరో విధంగా ఉంది. భారత్‌ను నగదు రహిత దేశంగా మార్చడమే ఆయన అంతిమ లక్ష్యంగా ఉంది. నిజానికి పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం ఎంతో తెలుసా? సుమారు నాలుగు

దేశంలో పెద్ద నోట్ల కరెన్సీ నోట్ల రద్దు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన మరో విధంగా ఉంది. భారత్‌ను నగదు రహిత దేశంగా మార్చడమే ఆయన అంతిమ లక్ష్యంగా ఉంది. నిజానికి పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం ఎంతో తెలుసా? సుమారు నాలుగు లక్షల కోట్లు. అదేసమయంలో బ్యాంకుల ద్వారా ప్రజలకు వచ్చిన మొత్తం రూ.75 వేల కోట్లకు లోపే. వెరసి... జనం సొమ్ములు బ్యాంకుల్లో ఇరుక్కుపోయాయి. ఇరుక్కుపోతూనే ఉంటాయి. 
 
'ఇబ్బందులు కొన్నాళ్లే' అని ప్రధాని మోడీ అన్నారు. రెండు మూడు వారాలే అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. కానీ 'కరెన్సీ కటకట' ఇప్పట్లో తీరేది కాదని, ఆరు నెలలకుపైగానే పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే 'నోటు'కు తాళం వేసేదిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. 
 
ఒకరకంగా చెప్పాలంటే... రద్దయిన నోట్లకు సమానంగా కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశమే కేంద్రానికి లేదు. నగదు లావాదేవీలపై పూర్తిస్థాయిలో పట్టు బిగించడం, తద్వారా నల్ల ధనాన్ని నియంత్రించడం ఇందులో అత్యంత కీలకం! అదేసమయంలో సామాన్య జనం కరెన్సీ కోసం ఇక్కట్లు పడక తప్పదు. పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం వేస్తున్న ఒక్కో అడుగును నిపుణులు విశ్లేషించి చెబుతున్న విషయాలివి.