శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (15:31 IST)

చెత్త ఏరేసిన ప్రధాని నరేంద్ర మోడీ - స్వచ్ఛ భారత్ సందేశం

modi garbage
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మరోమారు చెత్త ఏరివేసి, స్వచ్ఛ భారత్ సందేశాన్ని ప్రజలకు పంపారు. ఆదివారం ఢిల్లీలోని 'ప్రగతి మైదాన్ సమీకృత రవాణా నడవ'ను ఆయన ప్రారంభించారు. 
 
అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కనిపించిన చిన్నపాటి వ్యర్థాలను ప్రధాని స్వయంగా తన చేతులతో ఎత్తారు. ఓ ప్లాస్టిక్‌ సీసానూ సేకరించారు. 
 
సంబంధిత వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 'ఐటీపీఓ టన్నెల్‌ ప్రారంభోత్సవం సందర్భంగానూ ప్రధాని మోడీ.. చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటిచెప్పారు' అని పేర్కొన్నారు.
 
ప్రగతి మైదాన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అంతర్భాగమే ఈ 'ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా కారిడార్‌'. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.