1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (19:35 IST)

ప్రధానితో పారాలింపిక్స్ అథ్లెట్ల భేటీ... భావోద్వేగానికి లోనైన ఆటగాళ్లు

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన పారాలింపిక్స్ పోటీల్లో భారత అథ్లెట్స్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 19 పతకాలు సాధించారు. ఇందులో ఐదు బంగారు పతకాలు ఉన్నాయి. ఈ పోటీల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. భారతదేశం గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో ప్రధాని మోడీ ఆదివారం సమావేశమయ్యారు. 
 
ఈ సమయంలో ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు పీఎం వారి మనోబలాన్ని పెంపొందించారు. మీరు చాలా కష్టపడ్డారు అని ధైర్యం చెప్పారు. మీరు మా ఆటను ఐదు రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లారని, ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదంటూ క్రీడాకారులు ప్రధానికి కితాబిచ్చారు.
 
ఒక ఆటగాడు పీఎం మోడీతో ఓడిపోయినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. కానీ ఈ ఓటమి అతడిని మరింత బలోపేతం చేసింది. మరోసారి గెలిచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆటలో ఓడిపోయిన ఆటగాళ్ల ధైర్యాన్ని పెంపొందిస్తూ, ఓడిపోవడం ద్వారా గెలవడమే మా అతిపెద్ద బలం అని ప్రధాని అన్నారు.