శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (09:03 IST)

ఘనంగా వరడి ఊరేగింపు... అంతలోనే పోలీసుల ప్రవేశం.. అరెస్టు

arrest
ఒడిశాలో ఓ వరుడికి ఓ మాజీ ప్రియురాలు తేరుకోలేని షాకిచ్చింది. సంవత్సరాల తరబడి తనను ప్రేమించి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని ఆగ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు... వరుడిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని ఢెంకానాల్‌కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా పని చేస్తున్నాడు. బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో ఇటీవల అతడికి వివాహం నిశ్చియమైంది. మంగళవారం రాత్రి పెళ్లి జరగాల్సి వుండగా, కొన్ని నిమిషాల ముందు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 
 
ఈయన భువనేశ్వర్‌కు చెందిన యువతితో రెండేళ్ళుగా ప్రేమాయణం సాగించాడు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని అజిత్ నమ్మించాడు. మాటిచ్చాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఇపుడు మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన యువతి భువనేశ్వర్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మండపంలోనే అజిత్‌ను అరెస్టు చేసిన పోలీసులు, వధువు కుటుంబీకులు అందించిన బంగారు గొలుసు, ఉంగరం, చేతి గడియారాలను తిరిగి వారికి అప్పగించారు.