మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:05 IST)

ఒకటి ఆపితే.. వెయ్యి పుట్టుకొస్తున్నాయ్.. అశ్లీల సైట్లను ఆపలేం.. కేంద్రం

అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్టపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒక వెబ్‌సైట్‌కు బ్రేక్ వేస్తే వెయ్యి సైట్లు కొత్తగా పుట్టుకొస్తున్నాయని అందువల్ల వీటిని ఆపలేమంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం తేల్చి చెప్పి

అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్టపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒక వెబ్‌సైట్‌కు బ్రేక్ వేస్తే వెయ్యి సైట్లు కొత్తగా పుట్టుకొస్తున్నాయని అందువల్ల వీటిని ఆపలేమంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం తేల్చి చెప్పింది. ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు అప్‌లోడ్ కాకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ యూయూ లలితలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
 
ఈ సందర్భంగా కేంద్రం తన వాదనను వినిపించింది. అశ్లీల, లైంగిక హింస తదితర వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ కాకుండా చేసే యంత్రాంగం తమ వద్ద లేదని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఎదుట తన నిస్సహాయతను అంగీకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అలాంటి వీడియోలను అప్‌లోడ్ చేయడాన్ని నియంత్రించలేమంటూ స్పష్టం చేసింది.