బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (10:20 IST)

ప్రియుడు వదిలేశాడు.. గర్భవతి అని చెప్పినా రాలేదు.. నిప్పంటించుకుని..?

ప్రియుడు తనను వదిలేశాడనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడికి వివాహమైంది. 
 
అయితే, అతను కోయంబేడులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో టీ హోటల్ లో పనిచేసే ఓ యువతి అతడికి పరిచయమైంది.
 
ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. కానీ భర్త చేసిన ఫిర్యాదుతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇంటికి వారిని పంపించారు. అప్పటి నుంచి అతను భార్యతో ఉంటున్నాడు. 
 
అయితే, తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి అతని ఇంటి వద్దకు వెళ్లి తాను గర్భవతిని అని, తనతో రావాలని కోరింది. అయితే, అతను ఆమెతో వెళ్లేందుకు నిరాకరించాడు.
 
దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురై తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.