శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (12:38 IST)

జస్లోక్ నర్సు ఎంత పనిచేసింది.. డెంటిస్ట్ భార్యకు గర్భస్రావం అయ్యింది.. ఎలా?

ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగర

ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలోని జస్లోక్ ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కుర్లా ప్రాంతానికి చెందిన డాక్టరు తరన్నుమ్ వాసిఫ్ ఖాన్ దంతవైద్యుడిగా పనిచేస్తున్నాడు. 
 
వాసిఫ్ ఖాన్ 25 వారాల గర్భవతి అయిన తన భార్యను చికిత్స కోసం జస్లోక్ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే ఆ వైద్యశాలలో చేరడమే తన భార్యకు శాపమైందని డెంటిస్టు వాపోతున్నాడు. జస్లోక్ ఆసుపత్రి నర్సు తన భార్యకు మిసోప్రోస్ట్ మాత్ర బదులు గర్భం పోవడానికి మైక్రోగెస్ట్ మాత్ర ఇచ్చిందని వాసిఫ్ ఖాన్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మరో రోగికి ఇవ్వాల్సిన మాత్రలను తన భార్యకు ఇచ్చినందువల్ల తన భార్యకు గర్భస్రావం అయి కవలపిల్లలు పుట్టి మరణించారని డాక్టరు వాసిఫ్ ఖాన్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే తన కవల పిల్లలు మరణించారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఖాన్ కోరారు.