గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (11:40 IST)

గర్భిణీ మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించారు.. ఎక్కడ?

శివకాశి ప్రభుత్వాసుపత్రిలో ఎనిమిది నెలల మహిళకు హెచ్‌ఐవీ రోగి రక్తాన్ని ఎక్కించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శివకాశీ ప్రభుత్వాసుపత్రిలో 8నెలల గర్భిణీ మహిళ చికిత్స కోసం చేరింది. ఆమెకు శరీరంలో ఎరుపు రక్త కణాలు తక్కువగా వుండటంతో.. ఆమెకు ఓ యువకుడి నుంచి పొందిన రక్తాన్ని డాక్టర్లు ఎక్కించారు. 
 
అయితే ఆ యువకుడు హెచ్ఐవీ రోగి అని తేలింది. దీంతో ఆ గర్భిణీ మహిళ కూడా హెచ్‌ఐవీ వైరస్‌తో బాధపడుతోంది. ఈ వ్యవహారం ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యమేనని కారణమని బాధిత మహిళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రక్తాన్ని శరీరంలోకి ఎక్కించేటప్పుడు రక్త పరీక్షలు చేయాల్సిందిపోయి.. అలానే హెచ్‌ఐవీ రక్తాన్ని పేషెంట్‌కు ఎక్కించడం ఏమిటని ఆమె కుటుంబీకులు మండిపడుతున్నారు.