గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (19:32 IST)

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయి అనడానికి మా జంటే ఉదావరణ : ప్రేమలత

vijayakanth - premalatha
సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయి అని మన పెద్దలు అంటుంటారు. దానికి మా జంటే సరైన ఉదాహరణ అని సినీ నటుడు దివంగత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన విజయకాంత్ గురువారం మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విజయకాంత్‌తో తన వివాహం జరిగిన విషయాన్ని గతంలో ప్రేమలత ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
"పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయి" అనడానికి మా జంటే సరైన ఉదాహరణ. వివాహం తర్వాత ఆ మాట నిజమనే భావన నాకు కలిగింది. ఎందుకంటే వాళ్లది మదురైకు చెందిన కుటుంబం. మేము వేలూరులో ఉండేవాళ్లం. ఇరు కుటుంబాల మధఅయ ఎలాంటి పరిచయం లేదు. మాది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం. 
 
విజయకాంత్ సినిమాల్లో రాణిస్తున్న రోజుల్లో ఆయనతో నాకు పెళ్లి జరిగింది. పెళ్లి చూపుల సమయంలో హీరో అనే ఆర్భాటం లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన ప్రవర్తన మా నాన్న ఆనందించాడు. నన్ను ఆయనకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అలా 1990 జనవరి 31వ తేదీన మా వివాహం జరిగింది" అని ప్రేమలత విజయకుమార్ అన్నారు.