మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 20 జులై 2017 (13:17 IST)

రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయం... రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కేస్తారో తెలుసా?

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓ

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటు హక్కు వుంది.
 
వీరిలో 99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన 32 పోలింగ్ స్టేషన్ల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులన్నీ పార్లమెంటుకు చేరుకున్నాయి. వాటిని ఒక్కొక్కదాన్ని తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ సాయంత్రానికి ఫలితం వెల్లడవుతుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.