శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (17:00 IST)

బాలికపై పూజారి కన్నేశాడు.. స్వీట్లు ఇస్తానని అత్యాచారం చేశాడు..

వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బాలికపై పూజారి కన్నేశాడు. స్వీట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్‌కి చెందిన వెంకటరమణప్ప(68) అనే వ్యక్తి పూజారిగా పని చేస్తుండేవాడు. ఇతని అల్లుడు బెంగుళూరులో పూజారిగా పనిచేస్తున్నాడు. 
 
అల్లుడికి వేరే పని ఉండి ఊరు వెళ్ళాల్సి వచ్చి, కొద్దిరోజులు మామను వచ్చి తన గుళ్లో పూజారిగా బాధ్యతలు నిర్వహించమని కోరాడు. అందుకు అంగీకరించిన వెంకట రమణప్ప బెంగుళూరు వచ్చి గుళ్లోపూజాదికాలు నిర్వహించటం మొదలెట్టాడు.
 
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుడి బయట ఆడుకుంటున్నపదేళ్ల బాలికపై పూజారి కన్నుపడింది. ఆ తర్వాత బాలికను పిలిచి తనతో వస్తే స్వీట్లు ఇస్తానంటూ ఆశ పెట్టాడు. స్వీట్లకు ఆశపడిన బాలిక పూజారి వెంట వెళ్లింది. ఆలయ ప్రాంగణంలోని తన కుమార్తె ఇంటికి తీసుకువెళ్లి బాలికపై పూజారి అత్యాచారం చేశాడు. ఆడుకోటానికి వెళ్లిన బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో బాలిక తల్లితండ్రులు బాలికను వెతకటం ప్రారంభించారు.
 
బాలిక గురించి వాకబు చేయగా ఆలయ పూజారితో వెళ్లినట్లు గుడి బయట పూలు అమ్ముకునే వ్యక్తి చెప్పాడు. బాలిక తల్లితండ్రులు ఆలయ ప్రాంగణంలోని పూజారి ఇంటికి వెళ్లి చూడగా భయంతో గుక్కపెట్టి ఏడుస్తున్నబాలిక వారికి కనిపించింది. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నారు.