శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:41 IST)

కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదు తీసుకున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదును గురువారం తీసుకున్నారు. తొలి వ్యాక్సిన్‌ తీసుకున్న 37 రోజుల తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ డోసు వేయించుకున్నారు.

అదేవిధంగా అర్హత ఉన్న వారందరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ రెండవ దశ ప్రక్రియ మొదలైన ర్వాత అతనర్చి గా మా1న మోడీ..టీకా తొలి మోతాదును తీసుకున్నారు.

రెండవ డోసు తీసుకున్న ఫోటోను ట్వీట్‌ చేసిన ఆయన..వైరస్‌ను అంతమొందించే మార్గాల్లో టీకా ఒకటని అన్నారు. ' ఈ రోజు ఎయిమ్స్‌లో టీకా రెండవ డోసు తీసుకున్నారు.

వైరస్‌ను కట్టడి చేసేందుకు మన వద్ద ఉన్న మార్గాల్లో టీకా ఒకటి. మీరు టీకాకు అర్హులయితే.. డోసులను తీసుకోండి' అని ట్వీట్‌ చేశారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం వినియోగించే పోర్టల్‌ లింక్‌ను కూడా ట్వీట్‌కు జత చేశారు. కాగా, ప్రధాని మోడీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు.