శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (17:15 IST)

కాశ్మీర్ సమస్యపై శాశ్వత పరిష్కారం కనుగొనాలి.. మోడీ.. పెల్లెట్ గన్నులపై నిషేధం?

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్ని కాశ్మీర్ అంశంపై శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రతిపక్ష నేతలు మోడీని సోమవారం కలిసిన సందర్భం

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్ని కాశ్మీర్ అంశంపై శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రతిపక్ష నేతలు మోడీని సోమవారం కలిసిన సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రాజ్యాంగానికి లోబడే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందన్నారు. కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే.. మోడీని కలిసిన సందర్భంగా ఒమర్ అబ్ధుల్లా పెల్లెట్ గన్నుల వినియోగంపై వెంటనే నిషేధం విధించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిని నెలకోల్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వల్ల మన భారతీయులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వాళ్లు యువకులైనా, భద్రతా దళాలైనా, పోలీసులైనా వాళ్లంతా మనవాళ్లేనని చెప్పుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల వద్దకు వెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్రం నెలకొన్న పరిస్థితులపై మోడీకి రాష్ట్ర నేతలు వివరించారు.