ఇక రూ.500, రూ. 1000 నోట్లు చిత్తు కాగితాలు, ఊడ్చేద్దాం... మోదీ సంచలనం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో స్లీపింగ్ మాత్రలు వేసుకున్నా 'నల్ల' కోటీశ్వరులకు నిద్రపట్టదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి మరునాడు వీధుల్లో చెత్తను ఊడ్చేసినట్లుగా దేశంలో నల్లధనాన్ని ఊడ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో స్లీపింగ్ మాత్రలు వేసుకున్నా 'నల్ల' కోటీశ్వరులకు నిద్రపట్టదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి మరునాడు వీధుల్లో చెత్తను ఊడ్చేసినట్లుగా దేశంలో నల్లధనాన్ని ఊడ్చేద్దామని ఆయన జాతినుద్దేశించి ప్రకటించారు. ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించడంతో దేశంలో పెను దుమారం రేగుతోంది.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియా, మైనింగ్ రంగాల్లో పెద్దఎత్తున నల్లధనం పేరుకుపోయిందనీ, అందువల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పడంలేదన్నారు. రూ.500, రూ.1000 లను డిసెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేనివారు ఎవరైనా ఉంటే తమ గుర్తింపుకార్డులు సమర్పించి మార్చి 31 లోపు వాటిని డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు.